Fake Voter ID Drama in Hyderabad – సమంత, తమన్నా పేర్లతో షాకింగ్ కేసు!

హైదరాబాద్‌లో ఫేక్ ఓటర్ లిస్ట్ సంచలనం: సమంత, తమన్నా, రకుల్ పేర్లతో నకిలీ ఐడీలు వైరల్

హైదరాబాద్ నగరంలో ఇటీవల ఒక షాకింగ్ ఘటన బయటపడింది. సోషల్ మీడియాలో ఫేక్ ఓటర్ లిస్ట్ వైరల్ అవుతూ అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ లిస్ట్‌లో ప్రముఖ సినీ నటీమణులు సమంత రూత్ ప్రభు, తమన్నా భాటియా, రకుల్ ప్రీత్ సింగ్ పేర్లు, ఫోటోలు, ఓటర్ ఐడీ వివరాలు ఉన్నట్లు చూపిస్తూ కొన్ని పోస్టులు చక్కర్లు కొట్టాయి.

ఫేక్ లిస్ట్‌పై అధికారుల చర్య

ఈ పోస్టులు బయటకు రావడంతో ఎన్నికల అధికారులు వెంటనే స్పందించారు. ఆ లిస్ట్‌లో ఉన్న వివరాలు పూర్తిగా నకిలీవని వారు ప్రకటించారు. అసలు ఆ ఓటర్ ఐడీలు, EPIC నంబర్లు అన్నీ డూప్లికేట్  డేటా అని తేలడంతో మధురా నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.

పోలీస్ కేసు నమోదు

సహాయక ఎన్నికల నమోదు అధికారి సయ్యద్ యాహియా కమాల్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన ప్రకారం, ఆ పోస్టుల్లో ఈ నటీమణులు ఒకే చిరునామా వద్ద ఓటర్లుగా నమోదయ్యారని తప్పుడు సమాచారం ఇచ్చారు. EPIC నంబర్లను కూడా ఫేక్‌గా మార్చారు. ఇది ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నమని పోలీసులు తెలిపారు.

వర్తించిన చట్టాలు

ఈ ఘటనపై పోలీసులు భారత న్యాయ సంహిత (BNS) ప్రకారం సెక్షన్ 336(4) (ఒకరి ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతో నకిలీ చేయడం) ,సెక్షన్ 353(1)(C) (ప్రజల్లో గందరగోళం సృష్టించడం) కింద కేసు నమోదు చేశారు. ఇప్పుడు పోలీసులు ఆ ఫేక్ లిస్ట్‌ను మొదట ఎవరు సృష్టించారో, దానిని సోషల్ మీడియాలో ఎవరు పెట్టారని కనుగొనడానికి సైబర్ ట్రేసింగ్ చేస్తున్నారు.

CanSat Dude Movie Review GHMC Hyderabad Movie Review KLJAC KLSAT-2 KL University Mamitha Baiju Pradeep Ranganathan Research Projects Space Technology Student Innovation Telugu Cinema Telugu Film Critics Telugu Movie Review Youth Movies Hyderabad ఆర్టీసీ బస్సు ఎన్టీఆర్ జిల్లా ఎలక్షన్ న్యూస్ కంచికచర్ల కాంగ్రెస్ పార్టీ జగ్గయ్యపేట ట్రావెల్ న్యూస్ డ్యూడ్‌ మూవీ రివ్యూ తమన్నా తెలంగాణ రాజకీయాలు తెలంగాణ వార్తలు పల్లె వెలుగు బస్సు ఫేక్ ఓటర్ లిస్ట్ బంద్ ఫర్ జస్టిస్ బీజేపీ వార్తలు బీసీ జేఏసీ బీసీ రిజర్వేషన్లు బీసీల హక్కులు మంత్రి కొండా సురేఖ మహిళ వీరంగం రకుల్ ప్రీత్ విజయవాడ సమంత హైదరాబాద్ న్యూస్

GHMC హెచ్చరిక

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) కూడా ప్రజలకు హెచ్చరిక జారీ చేసింది. ధృవీకరించని సమాచారం పంచడం, ఫార్వర్డ్ చేయడం కూడా నేరం అవుతుందని స్పష్టం చేసింది. “కొంతమంది ఉద్దేశపూర్వకంగా తప్పుడు  సమాచారం పంచుతూ నటీమణుల పేర్లతో నకిలీ ఓటర్ లిస్టులు తయారు చేస్తున్నారు,” అని GHMC అధికారులు పేర్కొన్నారు.

ఎన్నికల కమిషన్ విజ్ఞప్తి

ఈ ఘటన జూబ్లీ హిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలకు కొద్ది వారాల ముందే వెలుగులోకి వచ్చింది. ఈ ఉప ఎన్నిక నవంబర్ 11న జరగనుండగా, ఓట్ల లెక్కింపు నవంబర్ 14న జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ప్రజలను విజ్ఞప్తి చేసింది — అధికారిక ECI వెబ్‌సైట్, GHMC పోర్టల్ లేదా అధికారిక సోషల్ హ్యాండిల్స్ ద్వారానే సమాచారం తెలుసుకోవాలని తెలిపింది.

ప్రజలకు సందేశం

సమంత, తమన్నా, రకుల్ ప్రీత్ సింగ్ వంటి ప్రముఖుల పేర్లను ఉపయోగించి ఫేక్ లిస్ట్‌లు సృష్టించడం వెనుక ఉద్దేశం ప్రజలను తప్పుదారి పట్టించడమే. ఈ తరహా పోస్టులను నమ్మకూడదని, ఎవరికైనా ఇలాంటి సమాచారం ఎదురైతే పోలీసులను లేదా GHMC అధికారులను సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *