Dude Telugu Movie Hyderabad Review | Hit or Miss?
డ్యూడ్‌ మూవీ review highlights Hyderabad audience

🎬 డ్యూడ్‌ మూవీ రివ్యూ (Dude Movie Review in Telugu)

నటులు: ప్రదీప్ రంగనాథన్, మమిత బైజు, శరత్ కుమార్, హ్రిందు హరూన్, రోహిణి
సినిమా జానర్: తమిళ్, తెలుగు, డ్రామా
దర్శకుడు: కీర్తిశ్వరన్
వ్యవధి: 2 గంటలు 19 నిమిషాలు

⭐ మొత్తం రేటింగ్: 3.5/5

 ప్రేమ అంటే త్యాగం అని గుర్తు చేసే కథ

ప్రేమంటే అందమైన ఫీలింగ్, కానీ దానిని నిలబెట్టడం మాత్రం చాలా కష్టం. మనం ప్రేమించే వాళ్లు దూరం అవుతుంటే మన మనసు ఒక్కసారిగా ఖాళీ అయిపోయినట్టుగా అనిపిస్తుంది. అదే పిలింగ్ ను బలంగా చూపించింది ‘డ్యూడ్‌’ సినిమా. ప్రేమ లేని జీవితం ఎలా నరకంలా మారుతుందో, ఆ ప్రేమ కోసం ఒక మనిషి ఎంతవరకు త్యాగం చేస్తాడో డైరెక్టర్ ఈ  కథలో చూపించాడు.

 కథ ఏంటంటే

ఆదిశేషు (శరత్ కుమార్) పశుసంవర్ధక శాఖామంత్రి. ఆయన చెల్లెలు రోహిణి (రోహిణి మోలేటి). వాళ్లిద్దరి పిల్లలు గగన్ (ప్రదీప్ రంగనాథన్), కుందన (మమిత బైజు). చిన్నప్పటి నుంచి ఇద్దరూ కలిసే పెరిగారు. కుందనకి గగన్‌ మీద ప్రేమ పెరుగుతుంది కానీ గగన్ మాత్రం వేరే అమ్మాయిని ఇష్టపడతాడు. ఆ అమ్మాయి వేరేవాడితో పెళ్లి చేసుకుంటుంది.

కుందన ఫారిన్ వెళ్లి అక్కడ పార్థు (హ్రిందు హరూన్) అనే యువకుడితో ప్రేమలో పడుతుంది. కానీ కులాంతర వివాహం విషయం రాగానే ఆదిశేషు కోపంతో కూతుర్ని చంపేయడానికి కూడా సిద్ధపడతాడు. చివరికి ఆమెను బలవంతంగా తన మేనల్లుడు గగన్‌కి పెళ్లి చేస్తాడు. ఇష్టం లేకున్నా గగన్ తాళి కడతాడు. తర్వాత కుందన, పార్థు ఇద్దర్నీ కలిపేందుకు గగన్ చేసిన సాహసమే ఈ సినిమా ప్రధాన కథ.

 భావోద్వేగాల సుడిగుండం

‘డ్యూడ్‌’లో ప్రేమ, బాధ, త్యాగం అన్నీ ఒకేసారి కనబడుతాయి . ప్రదీప్ రంగనాథన్ నటన ఈ సినిమాకి  హైలేటు. ప్రత్యేకంగా బాత్‌రూమ్‌లో ఒంటరిగా ఏడిచే సీన్‌లో ఆయన చూపించిన ఎమోషన్ హార్ట్ టచ్చింగ్‌గా ఉంది. మనసులోని బాధను మాటల్లో కాకుండా ఇలా ఎమోషన్ తో చూపించడంలో ఆయన మాస్టర్.

ప్రేమించిన అమ్మాయిని వేరేవాడికి ఇచ్చి పెళ్లి చేయడం సింపుల్ కాదు,కానీ ఆ అమ్మాయి సంతోషం కోసం తన జీవితం పణంగా పెట్టడం గగన్ చేసిన గొప్ప త్యాగం. ఈ కాన్సెప్ట్ చాలా మందికి కొత్తగా, కొంత షాకింగ్‌గా కూడా అనిపిస్తుంది.

దర్శకుడి టచ్

కొత్త దర్శకుడు కీర్తిశ్వరన్ ధైర్యంగా న్యూ కాన్సెప్ట్‌ని ఎంచుకోవడం సాహసం అనే చేప్పలి. ప్రేమ కథల్లో తరచుగా వచ్చే స్ట్రక్చర్‌ని బద్దలు కొట్టి, భావోద్వేగాల మీద బలమైన కథ అల్లాడమ్ గొప్పవిషయం . ఫస్ట్ హాఫ్‌లో ఫన్, ఎమోషన్ మిక్స్ బాగుంది. సెకండ్ హాఫ్‌లో మాత్రం కొంచెం సీరియస్ టోన్‌తో సాగుతుంది.

ఆర్య 2, నిన్నుకోరి సినిమాల ఇన్‌ఫ్లూయెన్స్ కొంచెం కనిపించినా, కథ ఎక్కడా రిపీటెడ్‌గా అనిపించదు. కొన్ని డైలాగ్‌లు కంటెంట్‌తో పాటు సోషల్ మెసేజ్ కూడా ఇస్తాయి. “ఏంటి క్రింజ్‌గా ఉందా? పక్కోడి ఫీలింగ్‌నే క్రింజ్‌గా చూడటం ఈ జెనరేషన్ ట్రెండ్‌ కదా!” అంటూ చెప్పే డైలాగ్‌ యూత్‌కి బాగా కనెక్ట్ అయ్యేలా ఉంటుంది.మొత్తానికి కీర్తిశ్వరన్ ఈ సినిమా తో హిట్టు కొట్టాడు.

 నటనలో ప్రదీప్ మ్యాజిక్

ప్రదీప్ రంగనాథన్ ‘డ్యూడ్‌’లో ఫుల్ ఎనర్జీతో కనిపించాడు. ఆయన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, ఎమోషనల్ రేంజ్ అన్నీ పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యాయి. “హీరో అనేవాడి కటౌట్ తో కాదు, కంటెంట్‌తోనే హీరో అవుతాడు ” అనే థాట్‌ని ఆయన ఈ సినిమాలో బలంగా ప్రూవ్ చేశాడు.

మమిత బైజు పాత్ర చాలా కాంప్లెక్స్ అయినా, ఆమె నటనతో సూపర్బ్ ఇంపాక్ట్ వచ్చింది. ముఖ్యంగా ఆమె కన్‌ఫ్యూజన్ సీన్స్‌లో చూపిన ఎమోషనల్ ఎక్స్‌ప్రెషన్స్ చాలా రియలిస్టిక్‌గా అనిపిస్తాయి.

శరత్ కుమార్ మినిస్టర్ పాత్రలో సింపుల్‌గా కనిపించినా, ఆయన నటనలో ఉన్న మేనరిజమ్ అద్భుతంగా పనిచేసింది. పాత విలక్షణ నటుల స్టైల్‌ గుర్తు వచ్చింది.

మ్యూజిక్, టెక్నికల్ వర్క్

సాయి అభ్యంకర్ మ్యూజిక్ ఈ సినిమాకి సౌల్ అనే చేప్పలి . బ్యాగ్రౌండ్ స్కోర్‌తో ఫీల్ డబుల్ అయింది. కెమెరా వర్క్, లైటింగ్, కలర్స్ అన్నీ విజువల్లీ రిచ్‌ అయ్యయి . మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడక్షన్ విలువలు ఈ సినిమాని మరో లెవల్‌కి తీసుకెళ్లాయి.

 మెసేజ్ తో కూడిన ప్రేమ కథ

‘డ్యూడ్‌’ కేవలం ప్రేమ కథ కాదు, సమాజంలో ఉన్న కులాంతర వివాహాల సమస్య, పరువు హత్యల గురించి కూడా సీరియస్‌గా చూపెట్టారు. “పరువు పోయిందని బాధపడేవాళ్లు, ప్రాణాలు తీయడం ఎందుకు? ప్రాణాలు తీసుకోవచ్చు కదా!” అనే డైలాగ్‌ ప్రేక్షకులను ఆలోచింపజేస్తుంది.

🔚 తుది మాట

‘డ్యూడ్‌’ ఒక ఫీల్‌గుడ్‌ కానీ, డీప్‌గా తాకే సినిమా. ప్రేమని దక్కించుకోవడం కాదు, ప్రేమని నిలబెట్టడం ఎంత గొప్పదో చూపించింది. ప్రదీప్ రంగనాథన్ తన హ్యాట్రిక్‌ హిట్‌ జాబితాలో ఈ సినిమాని కూడా చేర్చుకున్నాడు.

యూత్‌కి బాగా కనెక్ట్‌ అయ్యేలా ఉన్న ఈ మూవీ, ఎమోషన్‌, డ్రామా, త్యాగం అన్నీ కలగలిపిన ప్యాకేజ్‌.

ప్రేమ, త్యాగం, భావోద్వేగాలతో నిండిన హార్ట్ టచ్చింగ్ డ్రామా!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *