తెలుగు స్టైల్ స్పైసీ చికెన్ గ్రేవీ రెసిపీ ఆంధ్రా ఫ్లేవర్‌తో

చికెన్ గ్రేవీ రెసిపీ | కొత్తవారికి ఈజీ తెలుగు స్టైల్ రెసిపీ

చికెన్ గ్రేవీ తో రైస్, రోటీ, చపాతీ, పరాటాకు ఇది పర్ఫెక్ట్ కర్రీ . ఉల్లిపాయ, టమోటా, జీడిపప్పు, కారం, మసాలతో పాటు చికెన్నుకలిపి వండే ఈ గ్రేవీకి ప్రత్యేకమైన రుచీ, వాసన ఉంటుంది. ఇది చాలా సింపుల్ రెసిపీ — కొత్తవాళ్లకూ ,బ్యాచులర్కి ,వంటరీగా రూమ్ లో వుండే వారికి సులభంగా వండగలిగే రుచికరమైన చికెన్ గ్రేవీ రెసిపీ డిష్.

చికెన్ గ్రేవీ గురించి

ఈ సౌత్ స్టైల్ లో వండిన ఈ చికెన్ గ్రేవీకి రెస్టారెంట్ స్టైల్ ఫీలింగ్ వస్తుంది. చికెన్ కర్రీ అంటే చాలా మందికి ఇష్టం. ఈ రెసిపీని ఒకే పాత్రలో (one pot method) వండితే మంచి రుచి మరింత పెరుగుతుంది. ముందుగా చికెన్‌ను పెరుగు, మసాలాలతో మెరినేట్ చేస్తే చికెన్ పర్ఫెక్ట్ అవుతుంది. ఆ తర్వాత మసాలాలతో కలిపి నెమ్మదిగా ఉడికిస్తే ప్రత్యేకమైన ఫ్లేవర్ వస్తుంది.

ఈ రెసిపీ మా అమ్మ చెప్పినది, కానీ నేను కొంచెం మార్చి నా స్టైల్లో చేశాను. ఇప్పుడది మా ఫ్యామిలీకి రెగ్యులర్ లంచ్ ఐటెం అయిపోయింది. మీరు టైమ్ సేవ్ చేయాలనుకుంటే ప్రెషర్ కుక్కర్‌లో కూడా వండవచ్చు, కానీ ఓపెన్ పాత్రలో వండితే ఫ్లేవర్ బాగుంటుంది.

🥘 కావలసిన పదార్థాలు

చికెన్: కంట్రీ చికెన్ లేదా బ్రాయిలర్ చికెన్ ఏదైనా వాడొచ్చు, కానీ తాజా చికెన్ అయితే టేస్ట్ బాగుంటుంది.
ఉల్లిపాయ & టమోటా: ఈ గ్రేవీకి బేస్ ఇవి రెండు. వాటితో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడితే టెస్ట్ పర్ఫెక్ట్ వుంటుంది.
పెరుగు: ఇది చికెన్ గ్రేవీకి ఇంపార్టెంట్. గట్టిగా ఉన్న, పులుపు లేని పెరుగు వాడితే బెస్ట్ .
మసాలాలు: దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, స్టార్ అనీస్, జీలకర్ర, కరివేపాకు వాడాలి.
మసాలా పొడులు: కాశ్మీరి కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి.
గార్నిషింగ్: చివర్లో కొత్తిమీర,కొంచెం గరం మసాలా వేసితే కర్రీకి ఫ్లేవర్ పెరుగుతుంది.

 వండే విధానాలు

1. ప్రెషర్ కుక్కర్ విధానం:
అన్నీ పదార్థాలు వేసి రెండు విశిల్స్ వచ్చే వరకు వండండి. ఇది ఫాస్ట్ & ఈజీ.

2. ఓపెన్ పాన్ విధానం:
ఈ విధానంలో చికెన్ పూర్తిగా ఉడికేందుకు సుమారు 30 నిమిషాలు పడుతుంది. కంట్రీ చికెన్ అయితే 45 నిమిషాలు కూడా పడవచ్చు.

3. ఇన్‌స్టంట్ పాట్ విధానం:
బ్రాయిలర్ చికెన్ అయితే 10 నిమిషాలు, కంట్రీ చికెన్ అయితే 20 నిమిషాలు సెట్ చేయండి. టైమ్ saving తో పాటు రుచి కూడా బాగుంటుంది.

🧂 చికెన్ గ్రేవీ స్టెప్ బై స్టెప్

1️⃣ మిక్సీలో 3 పెద్ద టమోటాలు, 2 కాశ్మీరి ఎర్ర మిరపకాయలు, 12 జీడిపప్పులు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. నోట్: నీళ్లు వేయకండి.
2️⃣ బౌల్‌లో 500 గ్రాముల చికెన్ తీసుకుని ¼ కప్పు పెరుగు, ¼ టీస్పూన్ పసుపు, ఉప్పు, 1 టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి. 30 నిమిషాలు మెరినేట్ చేయాలి.
3️⃣ పెద్ద పాన్‌లో 2 టేబుల్ స్పూన్లు నూనె వేసి వేడి చేయాలి.
4️⃣ దాల్చిన చెక్క ½ అంగుళం, 2 లవంగాలు, 2 యాలకులు, 1 స్టార్ అనీస్, 1 టీస్పూన్ జీలకర్ర, కరివేపాకు వేసి వేయించాలి.
5️⃣ తరువాత 2 పెద్ద ఉల్లిపాయలు సన్నగా తరిగి వేసి ఉప్పు, 1 టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి.
6️⃣ ఇప్పుడు టమోటా-జీడిపప్పు ప్యూరీ వేసి బాగా కలపాలి. మసాలా పొడులు వేసి కొద్దిసేపు ఉడికించాలి.
7️⃣ చివరగా మెరినేట్ చేసిన చికెన్ వేసి నెమ్మదిగా వండాలి. చికెన్ పూర్తిగా ఉడికిన తర్వాత కొత్తిమీర వేసి దింపాలి.

సర్వ్ చేసుకోవడం

వేడిగా ఉన్న చికెన్ గ్రేవీని రైస్, రోటీ, చపాతీ, దోశ లేదా పరాటాతో సర్వ్ చేయండి. పక్కన ఉల్లిపాయ ముక్కలు, నిమ్మరసం ఉంటే రుచి డబుల్ అవుతుంది!

టిప్:
గ్రేవీకి క్రీమీయ్ టెక్స్చర్ రావాలంటే కొద్దిగా బట్టర్ లేదా ఫ్రెష్ క్రీమ్ చివర్లో కలపండి.

చికెన్ గ్రేవీ రెసిపీ మీ ఫ్యామిలీ లంచ్ లేదా డిన్నర్‌కి రుచి, స్పైస్ కలిగిన హైలైట్ డిష్ అవుతుంది. ఒకసారి ప్రయత్నించి, మీ టేస్ట్ బడ్స్‌ని హ్యాపీగా ఉంచండి!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *