చికెన్ దమ్ బిర్యానీ అంటే పేరు వింటేనే నోరూరిపోతుంది కదా! హైదరాబాద్ బిర్యానీకి ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏమి లేదు. ఆ రుచి, ఆ సువాసన, ఆ మసాలా ఘుమఘుమలు వాసనతో తింటే అదిరిపోతుంది . ఇంట్లోనే ఆ రెస్టారెంట్ స్టైల్ రుచిని సులభంగా చేసుకోవచ్చని మీకు తెలుసా? కింద చెప్పిన స్టెప్ బై స్టెప్ విధానాన్ని అనుసరిస్తే, మీరు కూడా ఇలాంటి చికెన్ దమ్ బిర్యానీ తయారు చేయవచ్చు.
బిర్యానీ మసాలా దినుసులు/Biryani Masala Items
బిర్యానీ మసాలా కోసం కావలసిన పదార్థాలు:
- దాల్చిన చెక్క – 2 అంగుళాలు
- లవంగాలు – 4
- జాపత్రి – ½ ముక్క
- మరాఠీ మొగ్గలు – 2
- అనాస పువ్వు – 1
- ఏలకులు – 4
- సోంపు – ½ tsp
- జాజికాయ – 1/8 ముక్క
- షాజీరా – 1 tsp
- బిర్యానీ పువ్వులు – 2
తయారీ విధానం
పైన చెప్పిన అన్ని మసాలా దినుసులను ఒక పాన్‌లో వేసి దోరగా వేయించాలి. ఆ తర్వాత వాటిని పొడి చేసి బిర్యానీ మసాలా పౌడర్‌గా తయారు చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ హోమ్మేడ్ మసాలా వల్లే మీ బిర్యానీకి అసలైన టేస్ట్ వస్తుంది.
చికెన్ మారినేషన్ విధానం:
పదార్థాలు:
- చికెన్ – 650 గ్రాములు
- ఉప్పు – తగినంత
- పసుపు – ½ tsp
- కారం – 1 tbsp
- బిర్యానీ మసాలా – 1 tbsp
- అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 tbsp
- పుదీనా ఆకులు – ⅓ కప్పు
- కొత్తిమీర తరుగు – ⅓ కప్పు
- పెరుగు – 1 కప్పు
నిమ్మరసం – ½ చెక్క
తయారీ:
ఒక పెద్ద బౌల్లో చికెన్ ముక్కలు వేసి, అందులో పసుపు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ మసాలా, పుదీనా, కొత్తిమీర, పెరుగు, నిమ్మరసం అన్నీ వేసి బాగా కలపాలి. ఈ చికెన్ కనీసం ఒక గంటపాటు పక్కన నానబెట్టాలి. ఇది చికెన్‌లో మసలాలు పూర్తిగా పట్టేలా చేస్తుంది.
బియ్యం సిద్ధం చేయడం:
బాస్మతి బియ్యం బిర్యానీకి పెద్ద టాస్క్ .400 గ్రాముల బాస్మతి బియ్యం ను కడిగి, ప్రక్కన 30 నిమిషాలు నీళ్లలో నానబెట్టాలి.అప్పుడు చికెన్ మారినేట్ కూడా సిద్దమవుతుంది, బియ్యం కూడా సాఫ్ట్‌గా అవుతుంది.
బిర్యానీ తయారీ విధానం:
పదార్థాలు:
- ఉల్లిపాయలు – 2 (సన్నగా తరిగినవి)
- నీరు – 3 కప్పులు
- ఉప్పు – తగినంత
- నెయ్యి – 3 tbsp
- నూనె – 4-5 tbsp
- బిర్యానీ ఆకు – 1
- గరం మసాలా దినుసులు – తగినంత
- పుదీనా ఆకులు – ¼ కప్పు
- కొత్తిమీర – ¼ కప్పు
- వేయించిన ఉల్లిపాయలు – గుప్పెడు
తయారీ విధానం:
- ఒక ప్రెషర్ కుక్కర్ లేదా మందపాటి బాటమ్ ఉన్న బాణలిలో నెయ్యి, నూనె వేసి వేడి చేయాలి.
- గరం మసాలా దినుసులు వేసి ఘుమఘుమల వాసన వచ్చే వరకు వేయించాలి.
- తరిగిన ఉల్లిపాయలను వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి.
- ఇప్పుడు మారినేట్ చేసిన చికెన్ ను వేసి బాగా కలిపి 5–7 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో ఉడికించాలి.
- చికెన్ నుండి సహజంగా సుమారు 2 కప్పుల నీరు వరకు వస్తుంది.
- ఇప్పుడు నానబెట్టిన బియ్యం వేసి కలపాలి.
- చికెన్ లో ఉన్న నీరు 2 కప్పులుంటే, ఇంకా 3 కప్పుల నీరు పోస్తే సరిపోతుంది.
- ఉప్పు ను రుచికి తగ్గట్టుగా చూసి తగినంత వేయాలి.
- పుదీనా ఆకులు, కొత్తిమీర, వేయించిన ఉల్లిపాయలు పైపైగా చల్లి కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి.
స్టవ్ ఆఫ్ చేసి 10 నిమిషాలు ఉంచాలి. ఆ తర్వాత మూత తీసి మెల్లగా కలపాలి.
హైదరాబాద్ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ సిద్ధం!
సర్వ్ చేయడం:
బిర్యానీని ప్లేట్లో సర్వ్ చేసి, పైగా వేయించిన ఉల్లిపాయలు, పుదీనా ఆకులు చల్లి అందంగా అలంకరించండి.పక్కన ఉల్లిపాయ రాయ్తా లేదా ఉడికించిన గుడ్డు పెట్టుకుంటే మరింత రుచిగా ఉంటుంది.
చిట్కాలు:
- బాస్మతి బియ్యం నాణ్యత బాగుంటే బిర్యానీ ఫ్లఫ్గా అవుతుంది.
- మారినేషన్ టైమ్ పెంచితే రుచి మరింత మెరుగవుతుంది.
- దమ్ పెట్టే ముందు నీరు ఎక్కువ కాకుండా చూసుకోండి – అప్పుడు బిర్యానీ జిగురుగా కాకుండా గింజ గింజగా అవుతుంది.
👉 Subscribe చేయండి మా చానెల్ “Telangana Flavours” – ఇలాంటి హోమ్ స్టైల్ రెసిపీల కోసం!
