మంత్రి కొండా సురేఖ బీసీల రిజర్వేషన్లపై మాట్లాడుతున్న ఫోటో

బీసీలకు న్యాయం చేయాలన్న పిలుపు – మంత్రి కొండా సురేఖ ఆగ్రహం:తెలంగాణలో బీసీల హక్కుల కోసం నినాదాలు మారుమ్రోగుతున్నాయి. రాష్ట్ర మంత్రి కొండా సురేఖ బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, “బీసీల పాపం బీజేపీకి తప్పక తగులుతుంది” అని మండిపడ్డారు.

రేథిఫైల్ బస్టాండ్ వద్ద బీసీ ఐక్య కార్యాచరణ కమిటీ (బీసీ జేఏసీ) ఆధ్వర్యంలో జరిగిన బంద్ ఫర్ జస్టిస్’ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా బీసీ సంఘాలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి బీజేపీ, బీఆర్ఎస్‌ లు  “బీసీ ద్రోహులు – తోడు దొంగలు” అని అన్నారు.

బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలన్న డిమాండ్:

మంత్రి సురేఖ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఎల్ఓపీ రాహుల్ గాంధీ ఆలోచన మేరకు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. “మా ముఖ్యమంత్రి ఒక రెడ్డి బిడ్డ అయినప్పటికీ, బీసీల న్యాయమైన హక్కును కాపాడేందుకు సవాల్‌గా తీసుకొని ఆ బిల్లును తీసుకొచ్చారు” అని పేర్కొన్నారు.

ఆమె వివరించిన ప్రకారం, ప్రభుత్వం ముందుగా ఆర్డినెన్స్ జారీ చేసిన  తర్వాత అసెంబ్లీలో బిల్లును ఆమోదించిఅని ఆమె అన్నారు. కానీ బీజేపీ మాత్రం అసెంబ్లీలో మద్దతు తెలిపిన తర్వాత కూడా గవర్నర్ వద్ద ఆ బిల్లును అడ్డుకోవడం ద్వారా దొంగాట ఆడుతోందని ఆమె ఆరోపించారు.

For More Related News:

గవర్నర్ సంతకం లేక బీసీల ఆశలు గాల్లోకి:

సురేఖ మాట్లాడుతూ, “గవర్నర్ ఒక్క సంతకం పెట్టి బీసీ బిల్లుకు ఆమోదం తెలిపి ఉంటే, ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగేవి. కానీ బీజేపీ డ్రామా వల్ల బీసీల ఆశలన్నీ అరియశాలు అయ్యాయి ” అని ఆమె అబిప్రాయపడ్డారు.

బీజేపీ హైకోర్టు, సుప్రీంకోర్టు లలో కూడా ఈ బిల్లును అమలు కాకుండా అడ్డుకుంటోందని, ద్వంద్వ ఆట ఆడుతోందని ఆమె తీవ్రంగా విమర్శించారు.

బీసీలకు న్యాయం చేయాలి అని డిమాండ్:

మంత్రి సురేఖ మాట్లాడుతూ, “బీసీలు మనుషులు కారా? వారి హక్కులు గుర్తించడం తప్పా?” అంటూ బీజేపీని నిలదీశారు. “ఈ బీసీ బిల్లు క్రెడిట్ మాకు వస్తుందని ఆపుతున్నారు అని ఆ క్రెడిట్ కావాలంటే ప్రధాని మోదీతో మాట్లాడి మీరే తీసుకోండి, కానీ బీసీలకు న్యాయం జరగాలి” అని బీజేపీ నేతలకు సవాల్ విసిరారు.

బీసీ ఉద్యమం ఉధృతం అవుతోంధా :

రాష్ట్రవ్యాప్తంగా బీసీ సంఘాలు ఏకమై, 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నాయి. బంద్ ఫర్ జస్టిస్‌ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా చైతన్య జ్వాలగా మారింది.

మొత్తం మీద, మంత్రి కొండా సురేఖ స్పష్టంగా చెప్పిన మాట ఏంటంటే – బీసీలకు కావలసింది కేవలం హామీలు కాదు, న్యాయమైన వాటా. ఆ హక్కును సాధించే వరకు తమ పోరాటం కొనసాగుతుందంటూ ఆమె హెచ్చరించారు.

ఫైనల్‌గా:


తెలంగాణలో బీసీల రిజర్వేషన్ల కోసం జరుగుతున్న ఈ పోరాటం రాజకీయాలకే పరిమితం కాదు, అది సామాజిక న్యాయం కోసం సాగుతున్న ప్రజా ఉద్యమం. “బీసీ ద్రోహులను ప్రజలు తేల్చి చెబుతారు” అంటూ మంత్రి కొండా సురేఖ ఇచ్చిన హెచ్చరికతో ఈ ఉద్యమం మరింత ఉధృతం కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *